ఎట్టకేలకు మహా ఉత్కంఠకు తెరపడింది. అంతరిక్షంలో ఇన్ని నెలలుగా ఉన్న వ్యామోగాములు భూమి మీదకు వచ్చారు. ఇదిలా ఉంటే నాసా కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన ఓ స్టిల్ లో భారత సంతతి వ్యామోగామి అయిన సునీతా విలియమ్స్ చాలా బలహీనంగా కనిపించారుముఖం పీక్కుపోయినట్టుగా కనిపించింది. దీంతో సునీత ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. సునీతకు సరైన ఆహారం అందిస్తున్నారా ? అనే సందేహాలను కూడా చాలా మంది వ్యక్తం చేశారు. దీనిపై మీడియా లోనూ .. సోషల్ మీడియా లోనూ విస్తృతమైన ప్రచారం జరిగింది .. అయితే ఈ ప్రచారాన్ని నాసా అధికారులు పూర్తిగా ఖండించారు.తాము ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఐఎస్‌ఎస్‌లో ఆహారానికి ఎలాంటి కొదవలేదని చెప్పారు. వ్యోమగాములకు వైవిధ్యంతో కూడిన పోషకాహారాన్నే సరఫరా చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. వ్యోమగాముల వ్యక్తిగత ఇష్టాలు .. అవసరాలకు అనుగుణంగా వారికే ప్రత్యేకమైన ఫుడ్ అందిస్తామని నాసా ప్రతినిధులు తెలిపారు. ఈ పదార్థాలను పూర్తిగా శీతలీకరించి ... లేదా వాటిని ప్యాకేజ్డ్ రూపంలో కానీ భూమి మీద నుంచి పంపుతారు. వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌లోని ప్రత్యేక యంత్రంలో వీటిని వేడి చేసుకొని తింటారని వారు తెలిపారు.అయితే వ్యోమోగాముల లకు తాజా పండ్లు .. కూరగాయల కొరత మాత్రం ఉంటుందట. వీటిని మాత్రం ప్రతి మూడు నెలలకు ఓ సారి మాత్రమే పంపుతారు. వ్యోమగాముల ఆరోగ్యాన్ని భూమి మీదున్న నాసా వైద్యులు ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ వారికి పలు జాగ్రత్తలు తెలిపారు. ఇక సునీత తో పాటు విల్మోర్‌లకు చిరు ధాన్యాల తో చేసిన ఆహార పదార్థాలు, పొడి రూపంలో పాలు .. పిజ్జా .. ష్రింప్ కాక్‌టెయిల్స్ .. వేయించిన చికెన్ అందించా రు.. అలాగే పొడి రూపంలో సూప్‌లనూ కూడా సరఫరా చేశారు. సమోసాలంటే అమితంగా ఇష్టపడే సునీత, మునుపటి అంతరిక్ష యాత్రలో ప్రత్యేకంగా వాటిని తెప్పించుకుని మరీ టేస్ట్ చేశారు.
![]() |
![]() |