మేడికొండూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో గత కొన్నిరోజులుగా దొంగలు ఉనికి చాటుతున్నారు. సాధారణంగా నగదు, బంగారం, ద్విచక్ర వాహనాలు, కార్లను లక్ష్యంగా చేసుకునే దొంగలు, ఈసారి మిర్చి సీజన్ను లక్ష్యంగా చేసుకున్నారు. డోకిపర్రు గ్రామంలో 15 క్వింటాల మిర్చిని అపహరించారు. రైతులు ఈ ఘటనను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీఐ నాగూర్ మేరా సాహెబ్ వెల్లడించారు.
![]() |
![]() |