ఈ జీలకర్రను మరిగించి నీటి రూపంలో ముఖ్యంగా ఈ ఎండాకాలంలో నెల రోజులు తీసుకుంటే.. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..జీలకర్రను మనం రెగ్యులర్ గా వంటలో ఉపయోగిస్తూనే ఉంటాం.ఈ జీలకర్ర లో చాలా పోషకాలు ఉన్నాయని, దీనిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని ఆయుర్వేదంలో కూడా పేర్కొన్నారు. వంటకు రుచిని పెంచే ఈ జీలకర్ర.. మనకు బరువు తగ్గించడంలోనూ సహాయం చేస్తుందని మీకు తెలుసా? ఈ జీలకర్రను మరిగించి నీటి రూపంలో ముఖ్యంగా ఈ ఎండాకాలంలో నెల రోజులు తీసుకుంటే.. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.జీలకర్ర నీరు తాగడం వల్ల చాలా సులభంగానే బరువు తగ్గవచ్చట.అంతేకాదు.. ఈ జీలకర్ర వాటర తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.కాబట్టి.. క్యాలరీలు పెరుగుతాయి అనే భయం అక్కర్లేదు.అయితే.. ఇవి బరువు పెరగకుండా కాపాడటమే కాదు.. మన శరీరంలో కొవ్వును కరిగించడంలోనూ సహాయపడుతుంది.జీలకర్ర నీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో మంటను తగ్గించే శక్తి ఈ నీటిలో ఉంది.ఉదయం ఖాళీ కడుపుతో వేడి జీలకర్రను మరిగించి, ఆ నీటిని ఫిల్టర్ చేసి త్రాగాలి. దీని కోసం, జీలకర్రను ఒక పాత్రలో వేసి మరిగించాలి. తర్వాత దాన్ని వడకట్టి, వేడిగా ఉన్నప్పుడే తాగాలి.
డైటీషియన్ల అభిప్రాయం ప్రకారం, బరువు తగ్గాలనుకునే వారికి జీలకర్ర నీరు ఒక గొప్ప ఎంపిక. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే, మీ జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. దీని కోసం, జీలకర్రను 1 గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం మరిగించిన తర్వాత, దానిని వడకట్టి త్రాగాలి. ఇది శరీరం నుండి అదనపు కొవ్వును తొలగించడానికి సహాయపడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు జీలకర్ర గింజలతో తయారు చేసిన కషాయాన్ని క్రమం తప్పకుండా తాగడం ద్వారా సమర్థవంతంగా బరువు తగ్గవచ్చు. జీలకర్ర ప్రధానంగా యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరం నుండి టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడుతుంది. జీవక్రియను ప్రేరేపిస్తుంది. ఈ ప్రభావం సమర్థవంతంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
జీలకర్ర , నీటి కలయిక శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది గుండె సంబంధిత ప్రమాదాలను తగ్గిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa