సీఎం చంద్రబాబును AIG హాస్పిటల్స్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు సీఎం తెలిపారు. ప్రభుత్వం, ఏఐ మెడ్ టెక్ ఫౌండేషన్‌తో కలిసి పరస్పర సహకారంతో ఆరోగ్య రంగంలో మరింత మెరుగైన మార్పులకు కృషి చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఏఐజీ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కలపాల కూడా విలువైన సూచనలు చేశారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరరెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు శాలువాతో సత్కరించి, తిరుమల శ్రీవారి జ్ఞాపికను బహుకరించారు. అంతేకాకుండా, స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. శుక్రవారం ఉదయం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విషయం విదితమే.
![]() |
![]() |