తిరువనంతపురం విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. కేరళ నుంచి 179 మంది ప్రయాణికులతో ఓ ఫ్లైట్ బెంగళూరు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. టేకాఫ్ అవడానికి కొద్ది నిమిషాల ముందు ఓ పక్షి విమానాన్ని ఢీ కొట్టింది. దీంతో ముందు జాగ్రత్తగా అధికారులు ఫ్లైట్‌ను రద్దు చేశారు. చివరికి ప్రయాణికులను మరో ఫ్లైట్‌లో బెంగళూరుకు పంపించారు.సోమవారం ఉదయం 179 మంది ప్రయాణికులతో ఇండిగో విమానం (6E 6629) బెంగళూరు వెళ్లేందుకు రన్‌వేపై సిద్ధంగా ఉంది. టేకాఫ్‌కు కొద్ది సేపటి ముందు ఆ విమానాన్ని పక్షి ఢీ కొట్టింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని రద్దు చేశారు. విమానం రద్దు కారణంగా అందులోని ప్రయాణికులు తీవ్ర ప్రభావితులయ్యారు. ఇండిగో సంస్థ మరో విమానంలో వారందరినీ సాయంత్రం 6:30 గంటలకు బెంగళూరు చేర్చినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి.
![]() |
![]() |