తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్‌మెంట్లు దాటి MBC కాటేజీల వరకు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 64,252 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,943 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.86 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
![]() |
![]() |