పరిగి పంచాయతీ కార్మికులు పెండింగ్ లో ఉన్న 5 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం పంచాయతీ కార్యదర్శి నారాయణకి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు వినోద్ మాట్లాడుతూ కార్మికులకు పెండింగ్ లో ఉన్న 5 నెలల జీతాలు ఉగాది, రంజాన్ పండుగలు దృష్టిలో ఉంచుకొని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పండగలోపు జీతాలు చెల్లించకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని ఏఐటీయూసీ నాయకులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa