డిసెంబరు 26 నుంచి భారతీయ రైల్వేశాఖ టికెట్ ధరలను సవరిస్తూ ప్రకటన చేసింది. పెరుగుతున్న ఖర్చులను భర్తీ చేస్తూ, ఎక్కువ మందికి రైల్వే సేవలను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 215 కి.మీల కంటే తక్కువ దూరం ఆర్డినరీ క్లాస్‌లో ఛార్జీలు పెంచలేదు. అంతకంటే ఎక్కువ దూరానికి ఆర్డినరీ క్లాస్‌లో కిలోమీటరుకు 1 పైసా, మెయిల్/ఎక్స్‌ప్రెస్ ఏసీ, నాన్-ఏసీ రైళ్లలో కిలోమీటరుకు 2 పైసలు పెంచారు. నాన్-ఏసీ ట్రైన్‌లో 500 కి.మీ ప్రయాణానికి అదనంగా రూ.10 చెల్లించాలి. ఈ మార్పుల వల్ల రైల్వేకు దాదాపు రూ.600 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa