చిలమత్తూరు మండలం పాతచామలపల్లి ఎస్సీ కాలనీ నందు సిసి రోడ్లు పరిస్థితి అధ్వానంగా మారిందని కాలనీవాసులు వాపోయారు. ఈ సందర్భంగా స్థానికంగా శుక్రవారం గ్రామస్తులు మాట్లాడుతూ అధికారులకు పలు మార్లు మొరపెట్టుకున్న పట్టించుకోలేదని, ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ఎన్నో రకాల హామీలు ఇస్తారు, కానీ రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్నా కూడా ఈ వైపు కన్నెత్తి కూడా చూడని రాజకీయ నాయకులు ఇకనైనా స్పందించాలని కోరారు.
![]() |
![]() |