TDP, YCPలపై APCC చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీల సాధనలో రెండుపార్టీలు విఫలమయ్యాయని దుయ్యబట్టారు. 11ఏళ్లు గడిచినా ఒక్కటీ అమలు చేయలేదని మండిపడ్డారు. హామీల అమలుపై చంద్రబాబు, పవన్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
పోలవరం వ్యయం తగ్గించాలని కేంద్రం చూస్తోందని, ఇప్పటికే ప్రత్యేకహోదా హామీని గొంతు పిసికి చంపేశారని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను చంపే కుట్ర జరుగుతోందని షర్మిల ఆరోపించారు.
![]() |
![]() |