వైసీపీ హయాంలో భారీ లిక్కర్ స్కాం జరిగిందంటూ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సాక్షిగా తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ వైసీపీ అధినేత జగన్ సన్నిహితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సీఐడీ సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో సీఐడీ నోటీసులను ఏపీ హైకోర్టులో కసిరెడ్డి సవాల్ చేశారు. సీఐడీ నోటీసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. సీఐడీ నోటీసులపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కసిరెడ్డి పిటిషన్ ను కొట్టివేసింది.
![]() |
![]() |