తిరుమలకు ముఖద్వారమైన అలిపిరి టోల్‌గేట్ వద్ద నిఘాపై టీటీడీ, పోలీసులు దృష్టిపెట్టారు. ఇక్కడ సిబ్బంది పనితీరుపై టీటీడీ సీవీఎస్వో(ఎ్‌ఫఏసీ) గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్న జిల్లా ఎస్పీ హర్షవర్ధనరాజు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అలిపిరిలో నిఘా వైఫల్యాలను ప్రస్తావిస్తూ ప్రచురితమైన వార్తల నేపథ్యంలో ఆయన టీటీడీ విజిలెన్స్, పోలీసు సిబ్బందితో కలసి దాదాపు రెండు గంటల పాటు తనిఖీలు చేశారు. లగేజీ స్కానర్ వద్ద సిబ్బందికి కనిపించకుండా నిలబడి వాహనాలు, సామగ్రిని ఎలా తనిఖీ చేస్తున్నారో గమనించారు. తనిఖీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
![]() |
![]() |