ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏఐ అవతార్‌తో,,,అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో వాదనలు వినిపించిన పిటిషనర్

international |  Suryaa Desk  | Published : Tue, Apr 08, 2025, 10:42 PM

కృత్రిమ మేధ లేదా ఏఐ ప్రస్తుతం ప్రపంచం దీని చుట్టూ తిరుగుతోంది. ఇది అన్ని రంగాలను విశేషంగా ప్రభావితం చేస్తోంది..అందులో భాగంగానే న్యాయ వ్యవస్థలోనూ ఏఐ వినియోగానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికాలో ఓ పెద్దాయన తన కేసు వాదించడానికి ఏఐ అవతార్‌ను లాయర్‌గా పెట్టుకోవడం గమనార్హం. తన డీవాల్డ్ రెప్లికాతో జడ్జి ముందుకు వచ్చాడు. అయితే, అసలు విషయం తెలిసి జడ్జి షాకయ్యారు. మనిషి లేకుండా వాదించేస్తున్న అర్టిఫిషియల్ లాయర్‌ని చూసి షాకైన జడ్జిలు.. ఒక కమాండింగ్ స్టాండ్ తీసుకున్నారు.. ఆ డెసిషన్ విన్నాక.. మనసు లేని అవతార్ కూడా బాగా హర్ట్ అయ్యుంటది.


న్యూయార్క్ స్టేట్ కోర్టులో జెరోమ్ డీవాల్డ్ అనే 74 ఏళ్ల పెద్దాయన తన పాత కంపెనీతో గొడవ కారణంగా. జైల్లో ఉన్నారు.. దాన్ని వాదించడానికి లాయర్ని పెట్టుకోకుండా.. తన కేసు తనే వాదించుకోవాలనుకున్నాడు. కోర్టు కూడా దానికి అంగీకరించింది. అంటే లాయర్ సరిగ్గా వాదించలేడేమో అని అనుమానం ఉన్నప్పుడు ఇలా కోర్టు వెసులుబాటు కల్పిస్తుంది.


  అయితే.. డీవాల్డ్.. నేను డైరెక్ట్‌గా చెప్పలేను.. వీడియోలో చెప్తానన్నాడు. సరే.. అదేదో తగలెట్టు అన్నారు న్యాయమూర్తులు.. వీడియో మొదలైంది.. స్క్రీన్ మీద ఒక మనిషి కనిపించాడు. చూడ్డానికి డీవాల్డ్ లానే ఉన్నాడు కానీ.. ఓ 40 సంవత్సరాలు చిన్నగా ఉన్నాడు, మంచి బట్టలేసుకుని ఏదో బ్లర్ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌లో నిలబడ్డాడు. అది చూసి ఒక జడ్జికి అనుమానం వచ్చింది. "ఎవర్రా ఈయన? నీ లాయరా?" అని డీవాల్డ్‌ను అడిగాడు. సింపుల్‌గా చెప్పాలంటే, ఒక ముసలాయన తన కేసు కోసం వీడియో చూపిస్తుంటే.. .. వీడియోలో వేరే యువకుడు నిపించడంతో జడ్జి కన్ఫ్యూజ్ అయ్యి అడిగారు అన్నమాట.


అప్పుడు డీవాల్డ్ ఏం చెప్పాడో తెలుసా? ... అది.. నేనే.. కానీ నేను కాదన్నమాట అన్నాడు.. అర్థంకాక అయోమయానికి గురయ్యారు అక్కడున్నవాళ్లంతా.. తీరిగ్గా.. అది నా డిజిటల్ రెప్లికా.. నేనే తయారు చేశానిది అని మెల్లగా చెప్పుకొచ్చాడు. అది నిజమైన మనిషి కాదు" ఇంకేముంది.. జడ్జి గారికి కోపం వచ్చేసింది.. సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చేశారు. ఇలాంటి అతి తెలివి ప్రదర్శించి కోర్టును తప్పుదోవ పట్టిస్తావా? అని మండిపడ్డారు. వెంటనే వీడియో ఆపేయమని గట్టిగా కేకలు వేశారు.


ఆ డిజిటల్ లాయర్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి క్రియేట్ చేశాడు. ఇది అమెరికా న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎలా చొచ్చుకువస్తున్నదో చూపిస్తుంది. నిజానికి, ఏఐ ఇప్పుడు డాక్యుమెంట్లు చదవడంలో, లీగల్ రిసెర్చ్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తోంది. కానీ, కోర్టులో ఒక మనిషి స్థానంలో ఏఐ వాదించడం అనేది చాలా పెద్ద విషయం.


అందుకే... న్యాయం అనేది కేవలం చట్టాలు చదవడమే కాదు. అక్కడ మనుషుల భావోద్వేగాలు ఉంటాయి, వాదనలుంటాయి, నిజం కోసం పోరాడే తపన ఉంటుంది. ఒక రోబోట్‌కు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? అంతేకాదు, ఒకవేళ ఏఐ తప్పుగా వాదిస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి అని ఆ ఏఐని గెట్ అవుట్ అన్నారు జడ్జి గారు.


ఈ ఒక్క సంఘటన చాలు కదా.., టెక్నాలజీ మన న్యాయ వ్యవస్థను ఏ మలుపు తిప్పబోతుందో చెప్పడానికి. భవిష్యత్తులో లాయర్ల స్థానంలో ఏఐ వస్తుందా? ఇది కేవలం ఒక చిన్న ప్రయత్నమా? లేక భవిష్యత్తులో జరగబోయే విప్లవానికి నాంది పలుకుతుందా? ఇక్కడ డీవాల్డ్ అయితే జడ్జిలకు సారీ చెప్పాడు. కానీ, ఈ ఘటన మాత్రం న్యాయ వ్యవస్థలో ఏఐ భవిష్యత్తు గురించి పెద్ద చర్చకు దారితీసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.


అయితే.. ఇలా కోర్టులో ఏఐ వాదించడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఉదాహరణకు, 'డూనాట్ పే' అనే ఏఐ చాట్‌బాట్ ట్రాఫిక్ టిక్కెట్లను అప్పీల్ చేయడంలో కొంతమందికి సహాయం చేసింది. అయితే, అది నేరుగా కోర్టులో వాదించలేదు. అది కేవలం సూచనలు ఇచ్చే ఒక టూల్ లాంటిది. పూర్తిస్థాయిలో మనిషి లాయర్‌లా వాదించే ఏఐ ఇంకా అభివృద్ధి చెందలేదు..


నిపుణులు ఏమంటున్నారంటే, భవిష్యత్తులో ఏఐ న్యాయవాదులకు సహాయకుడిగా బాగా ఉపయోగపడుతుంది. భారీ మొత్తంలో డేటాను విశ్లేషించడం, చట్టపరమైన చిక్కులను గుర్తించడం వంటి పనుల్లో ఏఐ చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. కానీ, క్లైంట్‌తో మాట్లాడటం, వారి ఎమోషన్స్‌ను అర్థం చేసుకోవడం, కోర్టులో వాదనలు వినిపించడంలో మనిషి తెలివి, అనుభవం చాలా ముఖ్యం. వాటిని ఏఐ పూర్తిగా భర్తీ చేయడమనేది ఇంపాజిబుల్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa