సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అతి త్వరలో ఫార్మా ఉత్పత్తులపై సుంకాలు విధించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అమెరికాలో ఫార్మా ఉత్పత్తులు తయారు కాకపోవడం వల్ల.. ఇతర దేశాల నుంచి వచ్చే వాటిపై సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో ఫార్మా కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు తరలివస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ దేశాలలో భారతదేశం కూడా ఉండటం గమనార్హం. అయితే తాజాగా చైనా వస్తువులపై అదనపు సుంకాలను విధించాలని అమెరికా నిర్ణయించింది. దింతో చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాలపై 104 శాతం సుంకం విధించినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఈ అదనపు సుంకాల మోతలు ఏప్రిల్ 9 మంగళవారం అర్ధరాత్రి నుండి అమల్లో ఉంటాయి. వాషింగ్టన్ అండ్ బీజింగ్ మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో ఇప్పటివరకు తీసుకున్న అత్యంత కీలక చర్యలలో ఇది ఒకటి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa