హిందూపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. రొద్దం మండలం శేషాపురం గ్రామానికి చెందిన శిల్ప బుధవారం రాత్రి పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చారు.
గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సాధారణ ప్రసవంలో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చారని డా. నీరజ తెలిపారు. శిశువుల బరువు తక్కువ ఉండటంతో అనంతపురం రెఫర్ చేశామన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa