టీమ్ఇండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరుదైన ఘనత సాధించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ రేటింగ్ సాధించిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు జస్‌ప్రీత్ బూమ్రా పేరిట ఉన్న రికార్డును బద్దలుగొట్టి.. కెరీర్ బెస్ట్ రేటింగ్ సాధించాడు. టీ20 వరల్డ్ నేపథ్యంలో భారత డిఫెన్స్ విభాగంలో వరణ్ చక్రవర్తి ఉండటం టీమ్ఇండియాకు మంచి పరిణామంగా కనిపిస్తోంది. కాగా, ఇటీవల ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు కేకేఆర్ వరుణ్ చక్రవర్తిని రిటైన్ చేసుకుంది.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుణ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. సఫారీలతో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఇప్పటి రెండేసి వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 6.75 ఎకానమీతో వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 818 పాయింట్లు సాధించాడు. దీంతో రెండో ర్యాంకర్ జేకబ్ డఫీ (699 పాయింట్లు)కి అందనంత దూరంలో నిలిచాడు. జాకబ్ కంటే 119 పాయింట్లు చక్రవర్తికి ఎక్కువగా ఉన్నాయి. 2017లో బుమ్రా కెరీర్ బెస్ట్ 783 రేటింగ్ పాయింట్లతో ఈ ఘనత సాధించాడు. వరుణ్ చక్రవర్తి ఇప్పుడు దాన్ని అధిగమించాడు.
టీ20 వరల్డ్ కప్‌లో కీలక పాత్ర..
గతేడాది బార్బడోస్‌లో టీమ్ఇండియా ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ టైటిల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే టీమ్ఇండియా ఆ టైటిల్‌ను మరోసారి చేజిక్కించుకోవడానికి.. దాదాపు రెండు నెలల సమయమే ఉంది. ఈ తరుణంలో వరుణ్ చక్రవర్తి టీమ్‌లో ఉండటం భారతదేశానికి మంచి పరిణామమే. రెండోసారి టీమ్ఇండియా టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని గెలుచుకునే.. ప్రయత్నంలో చక్రవర్తి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
మరోవైపు, లెఫ్ట్‌హ్యాండ్ సీమర్ అర్ష్‌దీప్ సింగ్.. దక్షిణాఫ్రికాతో జరిగుతున్న టీ20 సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచిన అర్ష్‌దీప్ సింగ్.. ఐసీసీ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని.. 16వ ప్లేస్‌కు చేరుకున్నాడు. అదే సమయంలో, దక్షిణాఫ్రికాకు చెందిన మార్కో జాన్సెన్ (14 స్థానాలు మెరుగుపడి 25వ స్థానానికి), లుంగీ ఎంగిడి (11 స్థానాలు మెరుగుపడి 44వ స్థానానికి), ఓట్నీల్ బార్ట్‌మాన్ టాప్ 100 కింది నుంచి 68వ స్థానానికి చేరుకున్నారు.
మెన్స్ టీ20 బెస్ట్ బౌలర్ రేటింగ్స్..
ఉమర్ గుల్ (పాకిస్తాన్) - 865
శామ్యూల్ బద్రీ (వెస్టిండీస్) - 864
డేనియల్ వెటోరి (న్యూజిలాండ్) - 858
సునీల్ నరైన్ (వెస్టిండీస్) - 832
రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్) - 828
తబ్రేజ్ షంసీ (దక్షిణాఫ్రికా) - 827
షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్) - 822
వరుణ్ చక్రవర్తి (భారత్) - 818
షాదాబ్ ఖాన్ (పాకిస్తాన్) - 811
వనిందు హసరంగా (శ్రీలంక) - 809
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa