చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో, ఈరోజు ఏపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం అనంతరం ఇందుకు సంబంధించిన గెజిట్‌ను న్యాయశాఖ జారీ చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఉత్తర్వులు ఇచ్చారు. ఇక, ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ ప్రకారం 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించినట్లు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఇటీవల మీడియాకు తెలిపారు. గ్రూప్-1లోని 12 ఉపకులాలకు 1 శాతం, గ్రూప్-2లోని 18 ఉపకులాలకు 6.5 శాతం, గ్రూప్-3లోని 29 ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయనున్నట్లు ఆయన వివరించారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఫలాలు అన్ని ఉపకులాలకు సమానంగా అందేలా 200 పాయింట్ల రోస్టర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa