AP: క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడేను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం పాస్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 2024 మే నుంచి నవంబర్ వరకు ఈ వేతనాలు విడుదల చేయనున్నారు. అయితే మొత్తం 7 నెలల కాలానికి గాను రూ.30 కోట్లు విడుదల చేయనుండగా.. ఒకొక్క పాస్టరుకు రూ.35,000 చొప్పున లబ్ధి చేకూరనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa