మంగళగిరి ఆక్టోపస్ హెడ్ క్వార్టర్స్ కానిస్టేబుల్ ఫరూక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఫరూక్ మృతదేహం గిద్దలూరు సమీపంలోని ఘాట్ రోడ్డులో లభించింది. అయితే ఫరూక్ నంద్యాలకు చెందిన ఓ యువతితో ప్రేమలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa