ములకలచెరువు లో 20వ తేదీన ఏపీ ఆయుష్ పారంపర్య వైద్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య చికిత్స శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎన్. ఎస్ ముక్తియార్ తెలిపారు. శుక్రవారం వైద్య శిబిరం కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములకలచెరువు మార్కెట్ యార్డ్ లో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వైద్య శిబిరం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa