ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో పనబాక దంపతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 16, 2019, 02:14 AM

సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ, ఆమె భర్త కృష్ణయ్యతో పాటు ఆమ‌ధ్య వైసీపీలో  చేరుతారంటూ తెగ ప్ర‌చారం జ‌రిగింది. అయితే శుక్ర‌వారం ఇద్ద‌రు దంప‌తులు నేరుగా చంద్ర‌బాబుని క‌లుసుకుని పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూప‌డంతో వారికి టీడీపీ తీర్థం ఇచ్చేందుకు సిఎం అంగీక‌రించారు.  పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు   పనబాక దంపతులకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తిరుపతి పార్లమెంట్‌ నియోజవర్గం నుంచి పనబాక లక్ష్మీ పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు చంద్రబాబు, పనబాక లక్ష్మీ మధ్య చర్చలు జరిగాయంటున్నారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa