మంగళగిరి, మే 1, 2025: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో జరిగిన మేడే ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGA) రాష్ట్రాభివృద్ధికి వెన్నెముకగా నిలిచిందని కొనియాడారు.
ఈ పథకం ద్వారా సుమారు 75 లక్షల 23 వేల మంది శ్రామికులు తమ సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల కింద ఈ పథకం కోసం రూ.10,669 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఈ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, శ్రామికుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచిందని డిప్యూటీ సీఎం వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa