తిరువనంతపురంలో ప్రధాని నరేంద్ర మోదీకి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సన్మానం చేశారు. నేడు మోదీ రూ. 8,900 కోట్ల విలువైన "విజింజం ఇంటర్నేషనల్ డీప్‌వాటర్ మల్టీపర్పస్ సీ పోర్ట్"ను దేశానికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాల్గొన్నారు. ఇది కేరళ ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో APSEZ ద్వారా అభివృద్ధి చేయబడింది.ఈ పోర్టు రూపకర్త ముఖ్యమంత్రి పినరయి విజయన్ అని మంత్రి వి.ఎన్. వాసన్ వెల్లడించారు.ప్రతి సంవత్సరం దేశానికి జరుగుతున్న సుమారు 22 కోట్ల డాలర్ల నష్టాన్ని ఈ పోర్టు తగ్గించగలదని సీఎం విజయన్ తెలిపారు.గతంలో అవసరమైన సదుపాయాలు లేనందున దాదాపు 75 శాతం కంటైనర్ కార్గోలను విదేశాల్లోని పోర్టుల ద్వారా మళ్లించాల్సి వచ్చేది.అయితే ఇప్పుడు విజిన్‌జం పోర్టు ప్రారంభంతో ఆ సమస్యకు పరిష్కారం లభించనుందని, ఇది దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.ప్రకారం ప్రకారం ఈ ప్రాజెక్టు 2045 నాటికి పూర్తవ్వాల్సి ఉండగా, దశాబ్దం ముందే పనులు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa