లారీ, బైక్ ఢీకొని ప్రమాదవశాత్తు తమిళనాడుకి చెందిన వరి కోత మిషన్ ఆపరేటర్ ముత్తుపాండి (26) శనివారం రాజుపాలెం మండలం, చౌటపాపాయపాలెం గ్రామం వద్ద అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు పనుల నిమిత్తం పిడుగురాళ్ల వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్సై వేణుగోపాల్ పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa