పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన నేపథ్యంలో, పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింధూ నదీ జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా, దాన్ని పేల్చేస్తాం అని హెచ్చరించారు. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరుకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ సింధూ జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు. ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa