వంట నూనె వినియోగం విషయంలో జాగ్రత్తలు పాటించడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఒక వ్యక్తి రోజుకు 3 నుంచి 5 చెంచాల మోతాదు కంటే ఎక్కువ నూనె తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దీని ప్రకారం, ఒక వ్యక్తికి నెలకు సుమారు అర లీటరు నూనె సరిపోతుంది.
ఒక నలుగురు సభ్యులున్న కుటుంబం విషయానికొస్తే, నెలకు 2 లీటర్ల కంటే ఎక్కువ నూనె వినియోగించకుండా చూసుకోవడం ఉత్తమం. అంటే, ఏడాదికి ఈ కుటుంబం 24 లీటర్ల నూనె మాత్రమే వాడాలి. ఈ మోతాదును అధిగమిస్తే, కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యలు, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం నూనె వినియోగంలో క్రమశిక్షణ పాటించడం అవసరం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa