కోడి కత్తి కేసులో రాష్ట్ర పోలీసులు ఏం చెప్పారో ఎన్‌ఐఏ కూడా అదే చెప్పింది. అయినా ఈ రాష్టం పోలీసులపైనా జనంపైనా వ్యవస్ధలపైనా విపక్ష నేతకి నమ్మకం లేదు. కానీ సిఎం కురిచి మాత్రం కావాలంటున్నాడని విమర్శించారు చంద్రబాబు నాయుడు . కాకినాడలో జరిగిన సభలో మాట్లాడుతూ అవాంతరాలు ఎన్ని సృష్టించినా, ఆధారాలు మాయం చేయాలని చూసినా కోడి కత్తి కేసులో గానీ, వివేకానంద హత్య కేసులో కానీ ఎవరినీ వదలం , కోడికత్తి పార్టీ తెలంగాణలో తెరాసతో కలిసిపోయి, హైదరాబాద్‌లో కూర్చొని వైకాపా అభ్యర్థుల జాబితా తయారు చేసారని, దీనికి కేసీఆర్ అనుమతి పొందాకే విడుదల చేసారని విమర్శించారు. తెదేపా డేటాను దొంగిలించి జగన్‌కు ఇచ్చారు. 9 లక్షల ఓట్లు అక్రమంగా తొలగించే కుట్ర చేశారు. ఎవరినీ వదిలిపెట్టం.’’ అని చంద్రబాబు హెచ్చరించారు. .తను కాపలా దారుడిని అంటూ ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్లు చేయటంపై మండి పడ్డ ఆయన దొంగలకు కాపలా కాస్తున్నారని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa