సోమవారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయిల్ సైన్యం గాజాపై తీవ్ర దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 20 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు సమాచారం. ఇజ్రాయిల్ సైన్యం గాజా స్ట్రిప్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు చేపట్టింది.
మరోవైపు, గాజాలో ఆహార సరఫరాను ఇజ్రాయిల్ సైన్యం పూర్తిగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ చర్య వల్ల గాజాలోని సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దాడులు, సరఫరా నిలిపివేతల నేపథ్యంలో గాజాలో మానవతా సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa