ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రధాని మోదీ తన మూడు దేశాల పర్యటనను వాయిదా వేసుకున్నారు. నార్వే, క్రొయేషియా, నెదర్లాండ్స్ లో ప్రధాని పర్యటించాల్సి ఉంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయన తన విదేశీ పర్యటనలను వాయిదా వేసుకున్నారు. ఈ పర్యటనలు మళ్లీ ఎప్పుడు జరుగుతాయనే విషయం ఇంకా వెల్లడి కాలేదు. మరోవైపు కేంద్ర కేబినెట్ తో మోదీ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీ అనంతరం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆపరేషన్ సిందూర్ పై ప్రకటన వెలువడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa