ఈ మధ్య విమానంలో ప్రయాణికుల మధ్య ఫైటింగ్‌లు జరుగుతున్నాయి. తాజాగా మరో ఘటన జరిగింది. విమానంలో ఓ యువతి విషయంలో జరిగిన గొడవ పెద్ద ఒకరి ముక్కు కట్ అయ్యే వరకు వచ్చింది. డైలీ మెయిల్ కథనం ప్రకారం.. ర్యాన్‌ఎయిర్ ఫ్లైట్ గ్లాస్గో ప్రీస్ట్‌విక్ నుంచి టెనెరిఫ్ సౌత్ వెళ్తోంది. అందులో ఓ వ్యక్తి ఫుల్లుగా మందు కొట్టి ఉన్నాడు. ఓ మహిళ కాళ్లకు బూట్లు వేసుకోకుండా టాయిలెట్‌కి వెళ్లింది. దీంతో ఆ మందుబాబుకి ఫుల్లు కోపం వచ్చింది. ‘ఆ కాళ్లతోనే మొత్తం తిరిగేస్తావా? నా కాళ్లు తొక్కేస్తావా?’ అంటూ చిర్రుబుర్రులాడాడు. అయితే, అదే సమయంలో ఆ యువతి బాయ్‌ఫ్రెండ్ అడ్డుపడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.
సీన్ అంతటితో అయిపోలేదు. ఈ వాగ్వాదం జరిగిన తర్వాత ఇద్దరు యువకులు మళ్లీ మద్యం సేవించారు. మొదటి వ్యక్తి విమానంలో గట్టిగా అరుస్తూ యువతిని, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను తిట్టడం మొదలుపెట్టాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన బాయ్ ఫ్రెండ్ గొడవపడ్డాడు. ఈసారి ఫైట్ పెద్దగా జరిగింది. విమానంలో తోటి ప్రయాణికులు వచ్చి వారించారు. ఇద్దరినీ విడదీసేందుకు ప్రయత్నించారు. చివరకు విమానంలోపల జరుగుతున్న ఫైటింగ్ గురించి క్యాబిన్‌లో ఉన్న పైలెట్లు కూడా కంగారుపడాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు ఎలాగోలా ఇద్దరినీ విడదీశారు. అయితే, అప్పటికే ఒకరు అవతలి వ్యక్తి ముక్కు కొరికేశారు. విమానం దిగిన తర్వాత ఆ ముగ్గురినీ పోలీసులకు అప్పగించారు ఫ్లైట్ సిబ్బంది.
Happy holidays pic.twitter.com/wnvilmsKCr
— Ben Wardrop (@wardrop_ben) March 16, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa