ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ ఎమ్మెల్యే కు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 08, 2025, 01:34 PM

కుంటిమద్ది హెలిప్యాడ్ ఘటన కేసులో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. గత కొంత కాలంగా అజ్ఞాతంగా ఉన్న ఆయన, ఈ రోజు అనంతపురం తిరిగి వచ్చారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న సీకేపల్లి ఎస్.ఐ సత్యనారాయణ, తన సిబ్బందితో కలిసి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఇంటికి వెళ్లి, 12 మేలోపు రామగిరి సర్కిల్ పోలీస్ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కుంటిమద్ది హెలిప్యాడ్ ఘటనకు సంబంధించి, ఈ కేసులో అతని పాత్రను విచారించేందుకు పోలీసులు ఆయనను విచారణకు పిలిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa