ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ అభిమాని గేదెల చైతన్యకు పాతపట్నం టిక్కెట్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2019, 09:47 PM

జనసేన పార్టీ 32 మంది అభ్యర్థులతో రెండో విడత జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో సికింద్రాబాద్ సహా ఐదు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఇచ్ఛాపురం, పాతపట్నం, ఆముదాలవలస నియోజకవర్గాలకు పవన్ అభ్యర్థులను ఖరారు చేశారు. పాతపట్నం నుంచి టికెట్ దక్కించుకున్న గేదెల చైతన్య పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఇతర అభిమానులతో కలిసి తన అభిమాన హీరో సినిమాలు చూసిన ఆయన ఇప్పుడు అసెంబ్లీ టికెట్ దక్కించుకున్నారు.
ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై పవన్ కళ్యాణ్ గళమెత్తిన సంగతి తెలిసిందే. బాధితులకు తోడ్పాటు అందించడంలో చైతన్య కీలక పాత్ర పోషించాడు. కిడ్నీ బాధితులకు అండగా.. నెలల తరబడి శ్రమించాడు. ఈ విషయాన్ని గుర్తించిన పవన్.. చైతన్యకు పాతపట్నం టికెట్ కేటాయించారు.  ఆముదాలవలస నియోజకవర్గం నుంచి జనసేన తరఫున టికెట్ పొందిన రామ్మోహన్, చైతన్య.. ఇద్దరూ 2014 నుంచి జనసేన కోసం పని చేస్తున్నారు. ఇచ్ఛాపురం నుంచి జనసేన పోటీ చేస్తున్న దాసరి రాజు కూడా ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా నిలిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa