విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మహిళా మండల ఆఫీసు వద్ద ఆగి ఉన్న ఓ కారులో నలుగురు చిన్నారులు ఆడుకోవడానికి వెళ్లారు. అయితే వారు కారులోకి వెళ్లి డోర్ వేసిన వెంటనే అది ఆటోమేటిక్గా లాక్ అయింది. వాహనంలో గాలి ప్రవాహం లేకపోవడంతో ఊపిరాడక చిన్నారులంతా శ్వాస తీసుకోలేక మృతి చెందారు.
ఈ ఘటనలో మంగి బుచ్చిబాబు, భవాని దంపతుల కుమారుడు ఉదయ్ (8), బుర్లు ఆనంద్ - ఉమా దంపతుల కుమార్తెలు చారుమతి (8), చరిష్మా (6), కంది సురేష్ - అరుణ దంపతుల కుమార్తె మనస్విని ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషాదకర సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. స్థానిక అధికారులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
ఈ సంఘటన మరొకసారి చిన్నారుల భద్రతపై ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. పార్క్ చేసిన వాహనాలలో పిల్లలు ఆటలాడకుండా పెద్దలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa