ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 21న తన సొంత నియోజకవర్గం కుప్పం రానున్నారు. ఇక్కడ జరుగుతున్న గంగజాతరలో భాగంగా ఆ రోజున జరిగే గంగమ్మ విశ్వరూప దర్శనంలో అమ్మవారిని చంద్రబాబు దర్శించుకుంటారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో ఆ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వచ్చి.. 2.30 గంటలకు తిరిగి ప్రయాణమయ్యేలా షెడ్యూల్ ఖరారైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa