కురబలకోట పరిధిలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మదనపల్లెకు చెందిన సురేంద్ర, అనసూయ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ములకలచెరువులోని బంధువుల పెళ్లికి బైక్ పై దంపతులు బయల్దేరారు. ఈ క్రమంలో కురబలకోట మండలం కంటేవారిపల్లె వద్దకు రాగానే వీరి బైక్ కు కుక్క అడ్డు రావడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. వారిని మదనపల్లె ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa