`నన్ను గెలిపించండి..పేదోడికి గూడునవుతా! మీ ఆస్తులకు రక్షకుడినవుతా `` అంటూ తాడేపల్లి పురప్రజలకు మంత్రి నారా లోకేశ్ అభయమిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న అభివృద్ధి ని అడ్డుకునేందుకు ప్రత్యర్థులు లేనిపోని పుకార్లు సృష్టిస్తారని, అసత్యాలను ప్రచారం చేస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏడు వేల మంది పేదలకు ఇళ్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత 18 నెలల్లో భూమి సమీకరించి...6 వేల ఇళ్లనిర్మాణమే తన లక్ష్యమని లోకేశ్ ప్రకటించారు. గుడిసెలో ఉంటున్నవారికి అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించాలని చూస్తున్న నాపై ఇటువంటి కుట్రపూరిత అవాస్తవాలను ప్రచారం చేస్తున్నవారికి ...మీ ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మీ ఇళ్లు..ఆస్తుల వైపు ఎవరైనా ఆక్రమణలకు వచ్చినా.. మిమ్మల్ని బెదిరించినా మీ వైపు నేనుంటాను.. ఎవరొస్తారో చూద్దామంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa