పొందూరు తహశీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సన్యాసిరావు వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. వాష్‌రూంలో మహిళా ఉద్యోగుల వీడియోలను రహస్యంగా చిత్రీకరిస్తున్న అతని బాగోతం బయటపడింది. ఓ మహిళా ఉద్యోగి అతని చర్యలను గమనించి, తహశీల్దార్ వెంకటేశ్‌కు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై సత్యనారాయణ నేతృత్వంలో జరిగిన దర్యాప్తులో, సన్యాసిరావు గత నాలుగేళ్లుగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తేలింది. ప్రస్తుతం పోలీసులు అతనిపై చర్యలు తీసుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa