కర్నూలు జిల్లా, పెద్ద కడబూరు మండలం, బసలదొడ్డి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుదాఘాతం కారణంగా ఆరేళ్ల చిన్నారి వేదవతి (6) మృతి చెందింది. ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో ఎర్త్ వైర్ తగలడంతో ఈ దుర్ఘటన జరిగింది.
మృత చిన్నారి వేదవతి, టీడీపీ మండల కన్వీనర్ ఈరన్న మనవరాలు. కడపలో మహానాడులో ఉన్న ఈరన్నకు సమాచారం అందడంతో ఆయన స్వగ్రామానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa