జూన్ 2న అనంతపురం జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ గుత్తి పట్టణాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్బంగా గుత్తి కోటపై జరగనున్న యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ విషయాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) ప్రభాకర్ నాయక్ శుక్రవారం తెలియజేశారు.
మే 21 నుంచి జూన్ 21 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ప్రాముఖ్యతను ప్రజల్లో పెంచడమే ఈ కార్యక్రమానికి ఉద్దేశ్యం.
ఈ కార్యక్రమంలో పట్టణం, గ్రామీణ ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎంపీడీవో పిలుపునిచ్చారు. యోగా పాటించటం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని, అందరూ చురుకుగా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa