హిందూపురం శాసనసభ్యులు, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ఎన్టీఆర్ అవార్డు ప్రకటించడంతో హిందూపురంలో ఆనందోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా స్థానికులు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ఎన్టీఆర్ పేరిట అవార్డులు ప్రకటించడం తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిందని, నట విశ్వరూపం ద్వారా ప్రజల మనసులను ఆకర్షించిన నందమూరి తారక రామారావు పేరిట ఈ అవార్డు బాలయ్యకు లభించడం గర్వకారణమని అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలయ్య కార్యాలయంలో కూడా ఉత్సవ వాతావరణం నెలకొని, సంబరాలు జరిగాయి.
ఈ అవార్డు ప్రకటన హిందూపురం ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడమే కాక, తెలుగు సినిమా, సంస్కృతి పట్ల గౌరవాన్ని మరింత పెంచిందని అభిమానులు అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa