వాతావరణ మార్పుల వల్ల వడగాల్పుల తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైద్యులు 'హీట్ మేనేజ్మెంట్' కోసం కీలక సూచనలు చేశారు. దాహం వేయకపోయినా ప్రతి గంటకు నీళ్లు తాగాలి, కొబ్బరి నీళ్లు, మజ్జిగ తీసుకోవాలి. ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లడం తగ్గించాలి. పుచ్చకాయ, కీరదోస వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు తినాలి. తలనొప్పి, కళ్లు తిరగడం వంటి వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa