ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటి నుంచి ఇండిగో టికెట్లపై ఫ్యూయల్ సర్‌చార్జ్

national |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 09:34 PM

మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధ ప్రభావంతో దేశీయ విమానయాన రంగంపై పడింది. అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో మార్చి 14 అర్థరాత్రి 12 గంటల నుంచి టికెట్లపై అదనపు 'ఫ్యూయల్ సర్‌చార్జ్' విధిస్తున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి సర్వీసులను బట్టి రూ.425-2,300 అదనంగా ఛార్జ్ చేయనున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడంతో, విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు కూడా పెరిగాయి. దీంతో ప్రయాణికులపై భారం పడకుండా తక్కువ మొత్తంలోనే ఈ సర్‌చార్జ్ విధిస్తున్నట్లు ఇండిగో తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa