ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుజరాత్‌లో దారుణం.. కూతురిపై తండ్రి అత్యాచారం.. భర్తను చంపిన మహిళ

Crime |  Suryaa Desk  | Published : Sun, Jun 01, 2025, 03:20 PM

కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి రాక్షసుడిలా మారిన దారుణ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటుచేసుకుంది. మూగ, చెవిటి సమస్యలతో బాధపడుతున్న తన కూతురిపై ఓ తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం గురించి కూతురు తన తల్లికి చెప్పడంతో, ఆమె తీవ్ర ఆగ్రహంతో భర్తను కొట్టి చంపేసింది. 
ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తన కుమార్తెపై అత్యాచారం చేసిన కారణంతోనే భర్తను చంపినట్లు మహిళ పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa