చిట్వేల్ మండలం, నక్కలపల్లి గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ విగ్రహాన్నియువ నటుడు నారా రోహిత్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అలాగే ఎన్టీఆర్ రాజకీయంగా, చిత్రసీమ పరంగా చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్, కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa