పాకిస్థాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యువ కంటెంట్ క్రియేటర్ సనా యూసుఫ్ దారుణ హత్యకు గురైంది. ఇస్లామాబాద్‌లోని ఆమె నివాసంలోనే ఈ దారుణం జరిగింది. ఆమెను చూడటానికి వచ్చిన ఓ బంధువే అతి సమీపం నుంచి కాల్పులు జరిపి హతమార్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటన పాకిస్థాన్ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.అప్పర్ చిత్రాల్ ప్రాంతానికి చెందిన సనా యూసుఫ్ సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండేది. ఆమెకు దాదాపు 4 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. మంగళవారం ఆమెను కలవడానికి వచ్చిన ఓ బంధువు ఇంటి బయట సనాతో కొంతసేపు మాట్లాడాడు. ఆ తర్వాత ఇంట్లోకి ప్రవేశించి, ఆమెపై పలుమార్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో సనా శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు.ఈ హత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ హత్య వెనుక అనేక కోణాలు ఉండవచ్చని, ముఖ్యంగా పాకిస్థాన్‌లో తరచూ జరుగుతున్న పరువు హత్యల కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని ఓ పోలీస్ అధికారి చెప్పినట్టు పాకిస్థానీ మీడియా పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa