ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వాట్సాప్ గ్రూప్ అయ్యర్‌ ఆటను ఎలా మార్చేసింది

sports |  Suryaa Desk  | Published : Tue, Jun 03, 2025, 09:05 PM

ఐపీఎల్ 2025లో శ్రేయస్ అయ్యర్ సూపర్ స్ట్రైక్‌రేట్‌తో అద్భుత ఫామ్ కనబర్చాడు. తన కెప్టెన్సీ స్కిల్స్‌తో పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. ఇటీవల ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 2లో అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్లాడు. 41 బంతుల్లో 87 పరుగులు బాది తన పవరేంటో చూపించాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య ఒత్తిడి పెట్టాలని చూసినా, బుమ్రా యార్కర్లతో ఇబ్బంది పెట్టినా అవేవీ శ్రేయస్ దూకుడును ఆపలేకపోయాయి. 12 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో పవర్ మోడ్ ఆన్ చేసి నాలుగు సిక్స్‌లు బాది మ్యాచ్‌ను ముగించాడు. దీంతో రెండు జట్లను ఐపీఎల్ ఫైనల్‌కు తీసుకెళ్లిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. అయితే శ్రేయస్ అయ్యర్‌‌కు ఈ ఫామ్ అంత సులభంగా రాలేదు. ఆ వివరాలు..


శ్రేయస్ తన చిన్ననాటి కోచ్‌‌‌తో ఏ టీమ్ ఏర్పాటు చేసుకుని పట్టుదల, అంకితభావంతో శ్రమించాడు. శ్రేయస్ 2.0గా సరికొత్తగా అవతరించాడు. ఈ సీజన్‌లో తన బ్యాటింగ్ గురించే అందరూ మాట్లాడుకునేలా చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో 600 పైగా పరుగులు చేసి అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచిన శ్రేయస్ అయ్యర్, ఇప్పటివరకు 39 సిక్స్‌లు బాదడం విశేషం. గతేడాది 14 సిక్స్‌లతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. అయితే ఇది అంత సులభంగా జరగలేదని, దీని వెనుక కఠోర శ్రమ ఉందని శ్రేయస్ చిన్ననాటి కోచ్ ప్రవీణ్ ఆమ్రే తెలిపారు.


శ్రేయస్ గేమ్‌తో కనెక్ట్ అయ్యేలా అతడి బ్యాటింగ్ స్వింగ్‌పై చాలా పనిచేశామని ప్రవీణ్ ఆమ్రే చెప్పారు. ‘ఐపీఎల్ 2025లో శ్రేయస్ స్ట్రైక్ రేట్ 175.80. దీన్ని మరింత మెరుగుపరుచుకోవాలని శ్రేయస్ భావిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మంచి ప్రదర్శన చేశాడు. అనంతరం పలు మ్యాచ్‌లు ఫినిష్ చేయడానికి చాలా శ్రమించినా, అది అతడి వల్ల కాలేకపోయింది. ఈ క్రమంలో నేను శ్రేయస్‌కు ఒకటే చెప్పా. శ్రేయస్.. ఇండియాలో మనం రేమండ్స్ సూట్స్‌ను ధరిస్తాం. గూచి, అర్మాని వంటి రెడీమేడ్ సూట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని కుట్టించి ధరిస్తాము. అదేవిధంగా వేరొకరిని అనుకరించడానికి ప్రయత్నించకుండా, మన విధానానికి అనుగుణంగా ఉండే టెక్నిక్‌ను ఎంచుకోవాలి’ అని శ్రేయస్‌కు చెప్పినట్లు ఆమ్రే తెలిపారు.


ప్రస్తుత సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ యావరేజ్ 54.82. గతేడాది 39.00 పోలిస్తే ఇది చాలా బెటర్. అయితే ఇంతకుముందు సీజన్లలో శ్రేయస్ బ్యాటింగ్ సగటు ఎప్పుడూ 40 దాటలేదు. అంతేకాకుండా గతేడాది 2 హాఫ్ సెంచరీలు కొట్టిన శ్రేయస్ ఈసారి 6 అర్ధసెంచరీలు బాదడం విశేషం. 2024లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి శ్రేయస్‌ను తప్పించిన తర్వాత సమయంలో ఈ పంజాబ్ కెప్టెన్ పెర్ఫామెన్స్ మరింత మెరుగుపడింది.


శ్రేయాస్ 2.0 ట్రాన్స్‌ఫర్‌మేషన్ సీక్రెట్ ఇదే..


శ్రేయస్ 2.0 ట్రాన్స్‌ఫర్‌మేషన్ వెనుక ఏం జరిగిందో అతడితో దాదాపు పదేళ్లు పని చేసిన ఫిజియోథెరపిస్ట్ అభిషేక్ సావంత్ వివరించాడు. ‘2023లో శ్రేయస్‌ గాయం కారణంగా ఐపీఎల్ ఆడలేకపోయాడు. అనంతరం అతడి గాయానికి సర్జరీ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితి నుంచి బయటపడటం ఎవరికైనా శారీరకంగా, మానసికంగా ఛాలెంజే. అలాంటి పరిస్థితిలో కమ్‌బ్యాక్ ఇవ్వాలని శ్రేయస్ అయ్యర్ అనుకున్నాడు. ఆ సమయంలోనే అతడిని బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించారు. అది అతడికి పెద్ద షాక్. అయితే అదే అతడికి మంచి అవకాశంగా కనిపించింది. అతడి కోర్ టీమ్ నుంచి కొంతమందితో ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేశాడు. దానికి మేము 'టీమ్ శ్రేయస్' అని పేరు పెట్టాం’ అని అభిషేక్ తెలిపాడు.


అమెరికా వీసాలు అందని ద్రాక్షేనా.. ఏడాదికి పైగా ఎదురుచూపులు!


‘మేము అతడి కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాం. దాన్ని ఫిజియో, ఎస్ &సీ, స్కిల్ సెట్స్ అనే మూడు భాగాలుగా విభజించాం. విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల మానసికంగా కూడా శ్రేయస్‌లో చాలా మార్పు వచ్చింది. అతడిని మరింత దృఢంగా తీసుకురావడానికి రెండు మూడు నెలలు చాలా దృష్టి పెట్టాం. ఈ సమయంలో తనను మరింత పుష్ చేయమని మమ్మల్ని శ్రేయస్ కోరడం విశేషం. అయితే కొన్ని వర్కౌట్ వల్ల శరీరం ఇబ్బంది గురిచేసినా, తన ప్రయత్నాన్ని మాత్రం శ్రేయస్ విడువలేదు’ అని అభిషేక్ వివరించాడు.


ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా.. శ్రేయాస్ అంకితభావంతో ముందుకు సాగాడని అభిషేక్ సావంత్ తెలిపాడు. శ్రేయస్‌లో ప్రయత్నలోపం లేదని అందుకే మునుపటి కంటే మరింత స్ట్రాంగ్‌గా అతడు తయారయ్యాడని చెప్పాడు. సరైన సమయంలో ఫోకస్‌గా సరైన పనులు చేస్తే ప్రతిఒక్కరికీ దానికి తగ్గట్టు ఫలితాలు వస్తాయని చెప్పాడు అభిషేక్ సావంత్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa