బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట కేసును కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సీఐడీకి అప్పగించారు. ఈ మేరకు శుక్రవారం (జూన్ 06, 2025) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణకు రిటైర్డ్ జస్టిస్ మైఖేల్ డికున్హా నేతృత్వంలోని బృందాన్ని నియమించారు.
కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కెఎస్‌సిఎ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి), మరియు డిఎన్‌ఎ నెట్‌వర్క్స్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసులో ఆర్‌సిబి మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలే, డిఎన్‌ఎ సిబ్బంది సునీల్ మాథ్యూ, కిరణ్‌తో సహా నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. తదుపరి విచారణ సీఐడీ ఆధ్వర్యంలో జరుగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa