అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని చిత్రచేడు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నంద, అరుణ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు చరణ్‌దీప్ (వయస్సు 2 సంవత్సరాలు) ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న సమయంలో దురదృష్టవశాత్తూ ఓ నీటి తొట్టెలో పడిపోయాడు.
తల్లిదండ్రులు గమనించకపోవడంతో బాలుడు నీరు ఎక్కువగా మింగి అపస్మారక స్థితికి చేరాడు. కొంతసేపటికి ఈ విషయం గుర్తించిన తల్లిదండ్రులు అతన్ని అత్యవసరంగా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నారి మృతితో తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa