AP: ప్రజలు తమపై నమ్మకంతో కేంద్రంలో మూడు సార్లు ఎన్డీయే కూటమిని గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. సోమవారం రాజమహేంద్రవరంలో ఆమె మాట్లాడుతూ.. ‘2047 నాటికి మనం వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి. గతంలో కేవలం 7 కోట్ల మంది మాత్రమే బ్యాంకింగ్ రంగానికి దగ్గరగా ఉండేవారు. ప్రస్తుతం 52 కోట్ల మందికి సేవలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా 15 కోట్ల మందికి జలజీవన్ మిషన్ కింద మంచినీటి సరఫరా జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa