ఉరవకొండ మండలం చిన్న ముష్షూరు సమీపంలోని 42వ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలో మృతదేహం రోడ్డు మధ్యలో ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
అనంతపురం నుంచి వస్తున్న ఉరవకొండ ఎస్ఐ జనార్ధన్ నాయుడు ఈ ఘటనను గమనించి వెంటనే తమ సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రోడ్డు పక్కకు తీసుకెళ్లారు. సమీపంలోని వారు ఈ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురయ్యారు.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని వాహనం ఎలా ఢీకొని పారిపోయిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. స్థానికులు జాతీయ రహదారిపై రాత్రి వేళల్లో వాహనాలు అతివేగంగా నడపడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa